హిందూపురం రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు పరిశీలన

హిందూపురం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం రైల్వే జనరల్ మేనేజర్ ముకుల్ శరన్ మాథూర్, బెంగళూరు డిఆర్ఎం అషి తోష్ కుమార్ సింగ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా రైల్వే అధికారులతో స్టేషన్ లో ప్రయాణికులకు ఉండాల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆర్ఎంఎస్ కార్యాలయం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్, పాత గూడ్స్ రోడ్డు ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైల్వే స్టేషన్ అమృత్ పథకం కింద ఎంపిక కావడం జరిగిందని సుమారు రూ15 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్