హిందూపురం పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రమాదకర మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు ప్రయాణికులకు, ద్విచక్ర వాహనదారులకు సూచించారు.