సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హిందూపురం పట్టణం చిన్న మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను శనివారం పరిశీలించారు. పేదలకు అందిస్తున్న భోజనం మెనూ, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా భోజనం పెట్టించుకుని రుచి చూశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐదు రూపాయలకే పేదలకు భోజనం పంపిణీ చేస్తోందని, రుచిగా, సుచిగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిదేనని కలెక్టర్ సూచించారు.