కదిరి పట్టణంలో రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని బుధవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి, సిఐలు నిరంజన్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.