కదిరిలో దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

కదిరి పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం వెనుక అడపాల వీధిలో చెత్త కుప్పల కారణంగా తీవ్ర దుర్వాసన వస్తోంది. వర్షం ప్రభావంతో ఈ దుర్వాసన మరింత ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తతో పాటు కుక్కల బెడద కూడా అధికమైందని, అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మురికి చెత్తను తొలగించి, కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్