శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, గురువారం శక్తి టీం బృందాలు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. పాఠశాలల్లో విద్యార్థినిలకు, రద్దీ ప్రాంతాల్లో మహిళలకు, వ్యవసాయ పొలాల్లో పనిచేస్తున్న మహిళలకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఈవ్ టీజింగ్, వేధింపులను సహించవద్దని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని కోరారు.