జిల్లాలో మంజూరైన అన్ని గృహాలను ప్రణాళికా బద్దంగా వేగవంతం చేసి ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో బుధవారం మంత్రి పార్థసారథి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పీఎంఏవై 1. 0 కింద 74, 489 గృహాలను మంజూరు చేయడం జరగగా, ఇప్పటివరకు 38, 762 ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 35, 727 ఇళ్లను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు.