కంబదూరు మండలంలోని 42 గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తామని ఎస్ఐ లోకేష్ పేర్కొన్నారు. బుధవారం కంబదూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లుగా ఇక్కడ ఎస్ఐగా ఉన్న ప్రవీణ్ అనంతపురానికి బదిలీపై వెళ్లారన్నారు. ఇప్పటినుంచి మండలంలో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరక్కుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామన్నారు.