ప్రజల సమస్యలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రజాసమస్యలు పరిష్కార వేదికలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎమ్మెల్యే సురేంద్ర బాబు, వివిధ శాఖల అధికారులు ప్రజాదర్బార్ గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.