శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో డ్రోన్లు, సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మంగళవారం పెనుకొండ సర్కిల్ కార్యాలయంలో కొరియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి సీసీ కెమెరాలు, డ్రోన్లు అందజేశారు. పెనుకొండ పోలీసులు వినియోగించుకునేందుకు కొరియన్స్ అసోసియేషన్ ఈ సహాయాన్ని అందించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కొరియన్స్ అసోసియేషన్ చైర్మన్, సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.