పుట్టపర్తిలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. వేసవిలో గ్రామాల్లో తలెత్తే తాగునీటి సమస్యలను ముందుగానే గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈ శ్రీనివాసతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.