శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ తాలూకా పరిగి మండలం కొడుగనహళ్లి పంచాయతీలో డ్రైనేజ్ నీరంతా పెద్ద కాలువలోకి చేరుతోంది. అయితే, ఆ పెద్ద కాలువను అధికారులు శుభ్రం చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ శుభ్రతపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.