సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం జమ్మలమడుగుకు పర్యటనకొస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి మంత్రి ఎస్. సవిత ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ముందుగా జమ్మలమడుగులోని గవర్నమంట్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను, అనంతరం గూడెం చెరువు వద్ద ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు.