నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం తిన్న కలెక్టర్

గురువారం, గోరంట్ల మండలం పూల చెట్ల పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన ఆయన, స్వయంగా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, మెనూ ప్రకారమే భోజనం అందించాలని ఆదేశించిన కలెక్టర్, వంటశాల, పాఠశాల పరిసరాలను కూడా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్