పెనుకొండలో పొంచి ఉన్న ప్రమాదం

పెనుకొండ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంపై ఎండిన భారీ చెట్టుకొమ్మ విరిగిపడి, కార్యాలయంపైనే నిలిచిపోయింది. ఈ చెట్టుకొమ్మ ఎప్పుడు కింద పడుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ప్రమాదకరంగా మారిన ఈ చెట్టుకొమ్మను తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటనతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్