గురువారం శ్రీ సత్య సాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెబ్ ల్యాండ్ అడంగల్ లోని క్లెయిమ్ చేయని, ఇతర పేరిట ఉన్న భూముల వివరాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్ డి వో, తహసీల్దార్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.