సీ ఎస్ ఆర్ నిథుల ద్వారా 5 బొలెరో వాహనాలను అందజేసిన ఎమ్మెల్యే

పుట్టపర్తి నియోజకవర్గ పోలీస్ శాఖకు సీఎస్ఆర్ నిధుల ద్వారా 5 నూతన బొలెరో వాహనాలను గురువారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో కలసి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు నూతన వాహనాలు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పత్తి చంద్రశేఖర్, డిఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్