పుట్టపర్తి: 'వయోవృద్ధుల పోషణ చట్టం 2007పై అవగాహన కల్పించాలి'

వయోవృద్ధుల పోషణ చట్టం 2007పై అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్ లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంరక్షణ నియమావళి 2011 పై జిల్లా స్థాయి సీనియర్ సిటిజెన్ కమిటీ సమావేశం, జిల్లా అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తప్పవు అన్నారు.

సంబంధిత పోస్ట్