గ్రామీణ అభివృద్ధిలో కేంద్ర బృందం సూచించిన లోటుపాట్లను వెంటనే సవరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులకు ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లో శుక్రవారం జరిగిన సమావేశంలో బృందం ప్రతినిధి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ, పీఎంఏవై-జి, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, పీఎంకేఎస్‌వై వంటి పథకాలను వివిధ మండలాల్లో పరిశీలించామని తెలిపారు.