శ్రీసత్య సాయి జిల్లాలో 37వ జాతీయ రోడ్డు భద్రత మాసం ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపోలో జరిగిన ఈ కార్యక్రమంలో, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ డ్రైవర్లను ఎస్పీ సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రమాద రహిత డ్రైవింగ్ కు ప్రాధాన్యతనిస్తూ, డ్రైవర్ల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, డిపో మేనేజర్, జిల్లా ప్రజా రవాణా అధికారి టీ. మధుసూదన తదితరులు పాల్గొన్నారు.