డి. హిరేహాల్: శుభ్రత పరిశుభ్రతకు కదిలిన అధికారులు

స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా, బుధవారం డి. హిరెహాళ్ మండల కేంద్రంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి దాస్ నాయక్, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి యోగానంద, పాలనాధికారి బలరామరావు, ఇతర సిబ్బందితో కలిసి శుభ్రత కార్యక్రమం చేపట్టారు. జాతీయ రహదారి పక్కన పడి ఉన్న వ్యర్థాలను పంచాయితీ సిబ్బంది, కార్మికులతో కలిసి తొలగించి, పరిసరాలను శుభ్రం చేయించారు.

సంబంధిత పోస్ట్