రాయదుర్గం: వంతెన పనుల పరిశీలించిన పీఆర్ ఎస్ఈ

కణేకల్లు మండలంలో రూ. 6కోట్ల నాబార్డు నిధులతో కణేకల్లు, మాల్యం మధ్య నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పీఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు బుధవారం పరిశీలించారు. వేదావతిహగరిపై నిర్మిస్తున్న ఈ వంతెన పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. అలాగే, కొత్తపల్లి మీదుగా ఆదిగానిపల్లి వరకు 7.6 కి.మీ. రహదారి ఏర్పాటుకు రూ. 4.19 కోట్లు, ఆదిగానిపల్లి నుంచి రచ్చుమర్రి వరకు రూ. 2.15 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఐసీడీఎస్ కార్యాలయం వద్ద రూ. 42లక్షలతో హెల్త్ సెంటర్ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్