శీంగనమల: కంది కోనుగోలు కేంద్రం తనిఖీ చేసిన అధికారులు

మంగళవారం, శింగనమల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో కేశవనాయుడు తనిఖీ చేశారు. శింగనమల మండలంలో కందుల తూకాల్లో వ్యత్యాసం ఉందని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీ జరిగింది. రైతుల నుంచి వివరాలు సేకరించిన ఆర్డీవో, తూకాల్లో అదనంగా తీసుకుంటున్నట్లు గుర్తించారు. అనంతరం, శింగనమల సచివాలయంలోని పీఫోర్ సర్వే కార్యాలయాన్ని తనిఖీ చేసి, దానిని వెంటనే మరో చోటుకు మార్చాలని ఎంపీడీవోకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషారెడ్డి, ఎంపీడీవో కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్