తరిమెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం తల్లి పాల వారోత్సవాలు నిర్వహించి, తల్లి పాల ప్రాముఖ్యతపై డాక్టర్ శంకర్తల్లి నాయక్ అవగాహన కల్పించారు. ముర్రుపాలు త్రాగించాలి, మొదటి 6 నెలలు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి అన్నారు. పాలు లేని పరిస్థితుల్లో తల్లి పాల బ్యాంకు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.