బ్రహ్మసముద్రం మండలంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై డ్వామా పీడీ సలీం బాషా శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. జేసీబీలతో పనులు చేయడం, హాజరు లేకుండా బిల్లులు చెల్లించడం వంటి అంశాలపై విచారణ చేశారు. నిజాలు దాచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.