అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ నేడు తాడిపత్రిలో పర్యటించి, గన్నెవారిపల్లి లేఔట్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,403 గృహాలు సిద్ధంగా ఉన్నాయని, వీటిలో 2,304 టిడ్కో గృహాలు, 3,099 హౌసింగ్ గృహాలు ఉన్నాయని గృహ నిర్మాణ అధికారి శైలజ తెలిపారు.