తాడిపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

తాడిపత్రిలో ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ దేవరాజు, ఫుడ్ ఇన్ స్పెక్టర్ తస్లీమా ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరిగమ, బాలాజీ గోబీసెంటర్, పిఎన్ఆర్ కిచెన్లలో కాలం చెల్లిన మాంసం, నాసిరకం వంటనూనె, దుర్వాసన వస్తున్న గోబీలను గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్