మరమ్మత్తులు కారణంగా తాడిపత్రిలో 3 రోజులు రైల్వేగేట్ మూసివేత

తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేటును లెవెల్ క్రాసింగ్ పనుల నిమిత్తం ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మూసివేయనున్నట్లు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. పుట్లూరు, ఆటోనగర్, అనంతపురం నుంచి కడప వైపు వెళ్లే వాహనదారులు రైల్వే స్టేషన్ ఫ్లై ఓవర్ ద్వారా ప్రయాణించాలని సూచించారు. వాహనదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్