తాడిపత్రిలోని పెట్రోల్ బంకులలో ఆదివారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సివిల్ డిప్యూటీ తహాసిల్దార్ మల్లేష్ ప్రసాద్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. కొన్ని బంకులలో సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా 'నో స్టాక్' బోర్డులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోతుందనే అపోహలతో ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.