ఉరవకొండలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

ఉరవకొండలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారాలు అసత్యమని తహశీల్దార్ భోగన్న గౌడ్ స్పష్టం చేశారు. మండలంలో 9 పెట్రోల్ బంకులు ఉండగా, పట్టణంలో 6 బంకులు సాధారణంగా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం 32,830 లీటర్ల పెట్రోల్, 50,303 లీటర్ల డీజిల్ స్టాక్ అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్