ఉరవకొండ మేజర్ పంచాయతీ పరిధిలో రోడ్లు, భవనాల వసతి గృహం నుంచి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. దీంతో ప్రధాన రహదారి విశాలంగా మారి, వాహనాల రాకపోకలకు అడ్డంకి తొలగిపోయింది. గతంలో కూరగాయల వ్యాపారులు, తోపుడు బండ్ల వల్ల ఏర్పడిన ట్రాఫిక్ సమస్యకు అధికారులు చెక్ పెట్టారు. టవర్ క్లాక్ వద్ద ఉన్న తోపుడు బండ్లను పాత బస్టాండ్‌లోకి మార్చారు. ఈ చర్యలతో ట్రాఫిక్ సమస్య తప్పడంతో వాహనచోదకులు ఆదివారం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.