మదనపల్లె–రాయచోటి ప్రైవేట్ బస్సులపై కేసులు

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రవాణా శాఖ గుర్తించింది. విజయవాడ రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు నేతృత్వంలో శనివారం విస్తృత తనిఖీలు జరిగాయి. మదనపల్లె, రాయచోటి నుంచి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వెళ్లే పలు ప్రైవేట్ ట్రావెల్స్‌పై నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్