శుక్రవారం చౌడేపల్లె మండలంలోని అంకాలమ్మ కొండ సమీపంలో చిరుత సంచరించిందనే వార్తతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారి ప్రభాకర్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత సంచారానికి ఎలాంటి గుర్తులు లభించలేదని, ప్రజలు అపోహలు వీడాలని అధికారులు సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా, పశువుల కాపరులు, గొర్రెల పెంపకందారులను అప్రమత్తం చేశారు. కొండ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి వేళల్లో పశువులను పొలాల వద్ద ఉంచవద్దని అధికారులు హెచ్చరించారు.