చోరీ కేసులో ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

పీలేరులో చోరీ కేసులో నిందితులైన ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను గురువారం పీలేరులో అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ పి. యుగంధర్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 95 వేలు విలువ చేసే 19  గ్రాముల బంగారు నగలు, 3 మోటార్ సైకిళ్ళు, 5 సెల్ ఫోన్లు, 6 కత్తులను సీజ్ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై బాలకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు అని సిఐ పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులు పాత గుంతకల్లుకు చెందిన వారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్