కలికిరి మండలం మహల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓపీ, డిస్పెన్సరీ రిజిస్టర్లను పరిశీలించి, సిబ్బందిని సేవలపై ప్రశ్నించారు. చిన్నపిల్లల టీకాల షెడ్యూల్‌ను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని, సిబ్బంది కొరతపై నివేదిక పంపాలని సూచించారు. ఆపరేషన్ థియేటర్, మౌలిక వసతులు, పరిశుభ్రతతో పాటు గర్భిణీల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.