ప్రొద్దుటూరు: విద్యార్థులపై లెక్చరర్ దాడి.. తల్లిదండ్రుల ఆగ్రహం

ప్రొద్దుటూరులోని దీప్తి జూనియర్ కాలేజ్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. శ్రీను, కృపాకర్ అనే ఇంటర్ విద్యార్థులను క్లాస్ రూమ్ లో గట్టిగా మాట్లాడుతున్నారని ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాసులు రెడ్డి వారిని విచక్షణారహితంగా కొట్టారని బుధవారం తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు గాయాలు కావడంతో కాలేజీ యాజమాన్యం చికిత్సకై స్ప్రే వేసి పంపించారని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్