శనివారం సాయంత్రం సిద్ధవటం మండలం భాకరాపేట ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద ఎస్సై హారిక ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని, అతివేగంతో ప్రయాణించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 మంది ద్విచక్ర వాహనదారులకు ఒక్కో వాహనంపై రూ. 185 చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.