రాజంపేట: ఇంజినీరింగ్ విద్యార్థుల గదుల్లో తనిఖీలు

రాజంపేట మండలం కొత్త బోయిన పల్లె సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల పీజీ రూముల్లో తనిఖీలు నిర్వహించినట్టు రాజంపేట రూరల్ సీఐ కుళ్లాయప్ప తెలిపారు. ఉన్నతాధికారుల సూచనలు మేరకు సోమవారం సబ్ డివిజనల్ స్పెషల్ పార్టీతో కలిసి హాస్టళ్లలో ఫుట్ పెట్రోలింగ్ చేశామని తెలిపారు. విద్యార్థుల రూములలో మత్తు పదార్థాలు, ఇతర ప్రమాదకర వస్తువులు కలిగి ఉన్నారా అనే అనుమానంతో ఈ తనిఖీలు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్