అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పన లక్ష్యంగా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం రాయచోటి, గుర్రంకొండలలో జరుగుతున్న ప్రత్యేక ప్రచార పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్న వివరాలను, డిజిటలైజేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. విధులు వ్యక్తిగతంగానే చేయాలని, అనధికారులకు అప్పగించరాదని స్పష్టం చేశారు. ప్రజలు కూడా మార్పులకు ఈ అవకాశాన్ని వాడుకోవాలని సూచించారు.