అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట ఎంపీడీవో కార్యాలయంలో జూలై 6న మండల సర్వసభ్య సమావేశం జరగనుంది. ఎంపీడీవో గంగయ్య యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంచార్జి ఎంపీపీ భూదేవి అధ్యక్షతన సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు అన్ని శాఖల మండల స్థాయి అధికారులు హాజరుకావాలని సూచించారు. మండల ప్రగతి నివేదికలను మూడు రోజుల ముందుగానే ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని అధికారులు కోరారు.