విశాఖ వేదికగా మరో దిగ్గజ ఐటీ సంస్థ భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఏఎన్ఎస్ఆర్ సంస్థ మధురవాడ ఐటీ క్లస్టర్‌లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఐదేళ్లలో పదివేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రానికి టాప్-100 ఐటీ కంపెనీలను రప్పిస్తామని లోకేశ్ వెల్లడించారు.