ఏపీలో అందుబాటులోకి మరో నేషనల్ హైవే

AP: మరో నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. చిత్తూరు-తచ్చూరు మధ్య నిర్మించిన ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ జాతీయ రహదారి (NH-716బి) అందుబాటులోకి వచ్చింది. ఈ హైవేలో అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. 116.5 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి, చిత్తూరు నుంచి చెన్నైలోని కామరాజార్ పోర్ట్, కట్టుల్లి పోర్టులకు అనుసంధానం కల్పిస్తుంది. ప్రస్తుతం 92 కిలోమీటర్ల పనులు పూర్తవడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఏపీలో 75 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్