విద్యార్థుల కోసం మ‌రో కొత్త కార్య‌క్ర‌మం

విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం తీసుకువచ్చింది. విద్యాశక్తి పేరుతో చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా ఆన్‌లైన్ బోధన అందిస్తున్నారు. స్కూల్‌, కాలేజీ సమయం పూర్తైన తర్వాత అదనంగా గంటపాటు మద్రాస్ ఐఐటీఎం వారితో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మద్రాస్ ఐఐటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి విద్యాశక్తిని కేవలం అనంతపురం, గుంటూరు జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్