అనుమతులు లేని ప్లాట్ల ఓనర్లకు మరో అవకాశం

AP: అనుమతులు లేని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లే అవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువును 2026 జనవరి 23 వరకు పొడిగించింది. ప్లాట్ల యజమానులు ఎల్‌టీపీ ద్వారా పీనలైజ్, ఇతర ఛార్జీలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ముగిసేలోపు అప్లై చేసుకుంటే ఓపెన్ ప్లేస్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ లభిస్తుంది. అయితే రెగ్యులర్ కాని ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి ఉండదు. నిర్మాణాలున్నా తొలగిస్తారు.

సంబంధిత పోస్ట్