AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో 12 కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. రేపల్లెలోని 30 పడకల సీహెచ్సీని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి రూ.58.42 కోట్లు, అదనంగా 66 పోస్టుల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 2026-27 తల్లికి వందనం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు రాటిఫికేషన్ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీల పెంపు ఉత్తర్వులకు కూడా అంగీకారం తెలిపారు.