ఏపీ కేబినెట్‌ భేటీ.. నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం!

ఏపీ కేబినెట్‌ సమావేశం నేడు (సోమవారం) జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నవంబర్‌ 14,15న విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు, పెట్టుబడి ప్రతిపాదనలు, భూ కేటాయింపులు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. మొత్తం మీద ఈ కేబినెట్‌ భేటీ కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.

సంబంధిత పోస్ట్