AP: అమరావతిలో గురువారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు భవనాల సమీపంలో రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు ఆమోదం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అలాగే సీఆర్డీఏ అగ్నిమాపక విభాగం ఏర్పాటు, పర్యాటక రంగ ప్రోత్సాహం, గ్రామకంఠంలో 5 సెంట్ల వరకు భూ కేటాయింపు, ఇళ్ల స్థలాలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.