నేడు ఏపీ కేబినెట్ మీటింగ్.. చర్చించే అంశాలు ఇవే!

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ మేరకు మంత్రులందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సమావేశంలో సీఐఐ సబ్మిట్‌, మొంథా తుఫాన్‌ కారణంగా జరిగిన పంట నష్టాలు, రైతులకు ఇవ్వాల్సిన పరిహారం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే అమరావతి అభివృద్ధి కోసం NaBFID నుంచి రూ.7500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగనుంది.

సంబంధిత పోస్ట్