AP: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్‌లో ‘ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025’ ముసాయిదాపై చర్చ జరుగుతుండగా, ‘ఏపీ ఏవియేషన్ పాలసీ-2026’కు ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్ అంశంతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. మరోవైపు మానవ అవయవ మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదనను కూడా కేబినెట్ పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.