ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తంగా 1,23,477మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రకటించారు. కాగా జూన్ 13 నుంచి 19వ తేదీ వరకు రీకౌంటింగ్/రీవెరిఫికేషన్‌కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.